వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై
కృష్ణా: గుడివాడ మండలం లింగవరం క్రాస్ రోడ్స్ వద్ద ఎస్పై చంటిబాబు సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత, రహదారి శాంతి భద్రత, నేర నిర్మూలన లక్ష్యంగా ఈ తనిఖీలను చేపట్టామన్నారు. వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ఇతర లీగల్ డాక్యుమెంట్లను పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.