అధ్వానంగా మారిన రోడ్డు. ప్రజలకు ఇబ్బందులు

అధ్వానంగా మారిన రోడ్డు. ప్రజలకు ఇబ్బందులు

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధి FCI ఎల్కలపల్లి మీదుగా వీర్లపల్లి, 8వ కాలనీకి వెళ్లాలంటే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.. కొన్నేళ్లుగా ఈ రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. అయినా బల్దియా అధికారులు లేదా పక్కనే ఉన్న RFCL యాజమాన్యం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై గుంతలు పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.