పరిగిలో టీడీపీ నాయకులు మృతి

పరిగిలో టీడీపీ నాయకులు మృతి

సత్యసాయి: పరిగి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు గోపాల్ శనివారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.