అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్.. ముగ్గురి అరెస్ట్

అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్.. ముగ్గురి అరెస్ట్

VKB: కుల్కచర్లలో అక్రమంగా భూముల రిజిస్ట్రేషన్‌కి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసిన SI రమేష్ కుమార్ తెలిపారు. పోలీసుల విచారణలో నిందితులైన కలకొండ మనోజ్ కుమార్, గడుల గణేష్, మురళి నాయక్ ఒక రైతును నమ్మించి మోసపూరితంగా 1 ఎకరా 16 గుంటల భూమిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని, రైతుకు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని తేలింది. నిందితులను రిమాండ్‌కు తరలించారు.