VIDEO: అధ్వానంగా ఆర్టీసీ బస్టాండ్

NRML: లోకేశ్వరం మండల ఆర్టీసీ బస్టాండ్ దుర్గంధంతో నిండిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బస్టాండ్ ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోయి చెరువును తలపిస్తుందని స్థానికులు వాపోతున్నారు. నీరు నిల్వ ఉండడంతో దోమలకు ఆవాసంగా మారింది. వర్షాలు పడిన ప్రతిసారి ఇదే సమస్య తలెత్తుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని స్థానికులు వాపోతున్నారు.