సబ్ స్టేషన్ ముట్టడించి రైతులు ఆందోళన

SRD: సిర్గాపూర్ మండలం కడపల్‌లో వ్యవసాయానికి త్రీ ఫేజ్ కరెంట్ సరఫరా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సబ్ స్టేషన్‌ను రైతులు ముట్టడించి ఆందోళనకు దిగారు. 24 గంటల సరఫరా లేక పంట పొలాలకు, అదేవిధంగా గ్రామంలో మంచినీటి సరఫరాకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. వెంటనే త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేశారు.