చందనోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యేల దూరం
VSP: సింహాచలం చందనోత్సవంలో వీఐపీ ప్రొటోకాల్ టికెట్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదమైంది. గతంలో వందకు పైగా ఉండే టికెట్ల కోటాను ఈసారి అధికారులు కేవలం 25కే పరిమితం చేయడంతో ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ కేడర్‌ను సంతృప్తిపరచడం సాధ్యం కాదని భావించిన పలువురు ఎమ్మెల్యేలు ఆ పాసులను నిరాకరించి, ఉత్సవానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.