టీడీపీ నేతలవి అసత్య ప్రచారాలు: మాజీ మంత్రి
NDL: బేతంచర్లలో శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో ప్లాట్లు వేశామని, టీడీపీ నేతలు తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓ ప్రకటనలో విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బేతంచర్లతోపాటు డోన్ నియోజకవర్గాన్ని తాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని అన్నారు. ఇది ఓర్వలేకే ప్రస్తుతం అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.