గ్రామస్థులకు అందుబాటులో అంబులెన్స్

గ్రామస్థులకు అందుబాటులో అంబులెన్స్

W.G: యలమంచిలి ఎంపీడీవో ఆఫీస్ వద్ద కొన్ని రోజుల క్రిందట ఒక యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేయగా వాహనం ఆలస్యంగా రావడంతో యువకునికి తీవ్రరక్తస్రావం అయ్యి ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. ఘటనపై చలించిన తాళ్లూరి శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో అంబులెన్సు కొనుగోలు చేసి గ్రామస్థులకు అందుబాటులో ఉంచారు.