'జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించాలి'
కోనసీమ: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని తక్షణమే నిర్మించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి 377 ద్వారా లోకసభలో కోరారు. జిల్లాలో అత్యవసర ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు లోపించడం వల్ల గ్రామీణ, విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో వైద్యపరమైన సమస్యలపై దృష్టి సారించాలన్నారు.