త్వరలో చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు పనులు షురూ: సీఎం

త్వరలో చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు పనులు షురూ: సీఎం

RR: తమ్మిడి హట్టి వద్ద త్వరలో చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా చేవెళ్ల ప్రాంతానికి సాగునీటి సదుపాయం మెరుగవుతుందని, రైతులకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.