రోడ్డు పొడవున ధాన్యం ఆరబోత
VKB: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు కల్లాలు లేకపోవడంతో బీటీ రోడ్లని కల్లాలుగా మార్చుకున్న సంఘటన దుద్యాల మండలంలో కనిపించింది. ముఖ్యంగా చిల్ముల్ మైలారం, చెట్టుపల్లి తండా, సాగారంతండా, గౌరారం గ్రామాలకు చెందిన రైతులు బాపల్లి తండా నుంచి కొడంగల్ వెళుతున్న బీటీ రోడ్డుపై ఒకపక్క దారి పొడవున వడ్లు ఆరబోశారు.