ఆయుధాలు వీడని వాళ్ల అంతు చూస్తాం: అమిత్ షా
మావోయిస్టుల నిర్మూలనపై లోక్‌సభలో కేంద్రమంత్రి అమిత్ షా స్టేట్‌మెంట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మావోయిస్టు రహిత ప్రాంతంగా బస్తర్‌ను అమిత్ షా ప్రకటించారు. మావోయిస్టు ముక్త బస్తర్‌లో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించినట్లు చెప్పారు. ఆ ప్రాంతంలోని ఆదివాసీల హక్కులను పరిరక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయుధాలు వీడని వాళ్ల అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు.