VIDEO: BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఇంటి వద్ద ఉద్రిక్తత
JGL: జగిత్యాలలో BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. BJP సీనియర్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్ ధ్వంసానికి యత్నించారు. ఇవాళ MP అరవింద్ ప్రెస్ మీట్ నేపథ్యంలో ఉద్రిక్తత జరగడం గమనార్హం. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.