రేపే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక..!
NLG: నందికొండ మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం కొలువుదీరనుంది. రేపు ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో పరోక్ష పద్ధతిలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు కమిషనర్ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.