రహదారి భద్రతపై అవగాహన
SDPT: రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఎస్ఐ అభిలాష్ ఆధ్వర్యంలో కోహెడలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద 'అరైవ్ అలైవ్' కార్యక్రమం నిర్వహించారు. ప్రమాద సమయంలో 'గోల్డెన్ అవర్' ప్రాముఖ్యతను వివరిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎలా చేయాలో ప్రదర్శన ద్వారా చూపించారు. పీఎం రాహత్, రహవేర్ సేవలపై అవగాహన కల్పించి, ప్రథమ చికిత్స శిక్షణ అందించారు.