విశాఖలో భారీ వర్షం

విశాఖలో భారీ వర్షం

VSP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం తెల్లవారుజాము నుంచి విశాఖలో మోస్తరు వర్షం కురుస్తుంది. ఈదురు గాలులు కూడా బలంగా వీస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం బుధవారం తెల్లవారుజాము వరకు కురుస్తూనే ఉంది. బుధవారం రోజంతా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.