క్రమశిక్షణతో కూడిన విద్యను అవలంబించాలి: రజిని
WNP: క్రమశిక్షణతో కూడిన విద్యను అవలంబించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని అన్నారు. మంగళవారం పెద్దమందడి మండలంలోనీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రజని మాట్లాడుతూ.. విద్యార్థులకు బాల్య వివాహాల నిషేధ చట్టం, ఫోక్స్ చట్టం గురించి తెలియజేశారు.