'ప్రపంచ స్థాయి పౌరులుగా ఎదగాలి'
అన్నమయ్య: పీలేరు శ్రీ భువన విద్యాలయంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ తృతీయ సోపాన్, రాజ్య పురస్కార్ శిక్షణా శిబిరాలు ఇవాళ ముగిశాయి. 259 మంది తృతీయ సోపాన్, 61 మంది రాజ్య పురస్కార్ శిక్షణలో పాల్గొన్నారు. ఏప్రిల్ 18–22 మధ్య జరిగిన ఈ శిబిరాల్లో ప్రకృతి వైపరీత్యాలు, నైతిక విలువలు, దేశభక్తి, సేవాభావం, ప్రథమ చికిత్సపై జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి అవగాహన కల్పించారు.