'నేడు కలెక్టరేట్‌లో టెస్కో స్టాల్ ఏర్పాటు'

KMM: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో టెస్కో స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చేనేత డివిజనల్ మార్కెటింగ్ మేనేజర్ బొట్టు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విక్రయాల్లో అన్ని రకాల వస్త్రాలపై 30 శాతం, రాజ్‌కోట్ ఇక్కత్ సిల్క్ చీరలపై 40 శాతం, ఎంపిక చేసిన వస్త్రాలపై 50 శాతం ప్రత్యేక తగ్గింపు ఉంటుందని తెలిపారు.