ఎమ్మెల్యే కోనేటి రేపటి పర్యటన వివరాలు
TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సత్యవేడు చేరుకుని నిర్మాణంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపం, అన్నా క్యాంటీన్ పనులను పరిశీలిస్తారు. అనంతరం సిరునంబుదూరులో జరిగే ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.