దేవనకొండలో 'నేడు టీడీపీ సమీక్షా సమావేశం'
KRNL: ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో దేవనకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో ఇవాళ ఉదయం 10 గంటలకు సమీక్షా సమావేశం, గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మండల అభివృద్ధి పనులు, శాఖల సమీక్షతో పాటు ప్రజల సమస్యలపై నేరుగా వినతులు స్వీకరించనున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని టీడీపీ క్యాంప్ కార్యాలయం తెలిపింది.