ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

TPT: నెల్లూరు కలెక్టరేట్ లో శుక్రవారం జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లాల ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. స్వర్ణముఖి బ్యారేజి నీటి అవసరములకు అలాగే గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో త్రాగునీటి, చెరువులు, పాడి పశువుల నీటి అవసరములకు 3 టీఎంసీలు నీటిని విడుదల చేయాలని మంత్రి నారాయణను ఎమ్మెల్సీ కోరారు.