'జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి'

SRD: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ భవాని చంద్ర ఈరోజు తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట్, ఖేడ్ కోర్టుల్లో నిర్వహించే లోక్ ఆదాలత్‌ను ప్రజలు, కక్షిదారులు ఉపయోగించుకోవాలని తెలిపారు. రాజీమార్గంతో కేసులను పరిష్కరించుకోవాలన్నారు.