VIDEO: కుంగుతున్న కౌండిన్య కల్వర్టు
CTR: పుంగనూరు పట్టణం కౌండిన్య నదిపై కల్వర్టు పూర్తిగా దెబ్బతింది. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. చిత్తూరు నుంచి పట్టణంలోకి రావాలంటే ఇదే మెయిన్ రోడ్డు కావడంతో కల్వర్టుపై ప్రయాణించేందుకు వాహనదారులు భయపడుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.