పుత్తూరులో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు
TPT: పుత్తూరు పట్టణంలో ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్వేటి నగరం రోడ్డు సర్కిల్ వద్ద సుమారు 400 మందికి మజ్జిగ అందించారు. ఈ సందర్భంగా కోనేటి రవిరాజు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.