వైభవంగా వైకుంఠ ఏకాదశి పూజలు
VZM: గజపతినగరంలోని శ్రీరామ క్షేత్రం జంక్షన్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు స్వామివారికి సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.