VIDEO: వైభవంగా బుర్రేశ్వరస్వామి కళ్యాణం
AKP: మండల కేంద్రమైన ఎస్ రాయవరంలో ఉమా, బాల త్రిపుర సుందరి సమేత బుర్రేశ్వరస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తుల సమక్షంలో వేద పండితులు కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. ముందుగా ఎదురు సన్నాహ ఉత్సవం జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు.