అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

అనంతపురం జిల్లా నార్పలలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. జగనన్న వసతి దీవెన పథకం నిధులను విడుదల చేశారు.

అనంతపురం జిల్లా నార్పలలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. జగనన్న వసతి దీవెన పథకం నిధులను విడుదల చేశారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 913 కోట్లు జమ చేశారు. వసతి దీవెన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా  9,55,662 మంది విద్యార్థులకు లబ్ధికలగనుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ. 4275.76 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.