పిల్లుట్ల కస్తూర్భాలో ప్రవేశాల గడువు పొడిగింపు

పిల్లుట్ల కస్తూర్భాలో ప్రవేశాల గడువు పొడిగింపు

PLD: మాచవరం పిల్లుట్ల కస్తూర్భా పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలకు గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రిన్సిపల్ సునీత శుక్రవారం తెలిపారు. విద్యార్థినిలు ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ, ఆదాయం సర్టిఫికెట్, ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.