వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు చోరీ
GNTR: ఓ వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన మంగళగిరిలో ఆదివారం జరిగింది. ఈశ్వరమ్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలు తన ఇంటికి సమీపంలోని అమ్మవారి ఆలయం వద్ద ముగ్గు వేస్తుండగా ఓ దుండగుడు వెనకనుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న సుమారు రూ.10 లక్షలు విలువ చేసే 96 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారైనట్లు పోలీసులు తెలిపారు.