'బీఆర్ఎస్ గెలుపుతో ఆలేరు పట్టణ అభివృద్ధికి బాటలు'
BHNG: ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో పట్టణ అభివృద్ధికి బాటలు వేయాలని, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి అన్నారు. ఆలేరులో బుధవారం 2, 3వ వార్డులలో ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత అమలు చేయక ప్రజలను మోసగించారన్నారు.