బస్సులు ఆగకపోవడంపై MLA స్పందన

బస్సులు ఆగకపోవడంపై MLA స్పందన

కృష్ణా: బస్టాప్‌లలో బస్సులు ఆగకపోవడంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై MLA యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. ప్రతి బస్టాప్‌లో బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. MLA ఆదేశాలతో బుధవారం డిపో మేనేజర్ శివాజీ డ్రైవర్లు, కండక్టర్లకు సూచనలు జారీ చేశారు. ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.