VIDEO: శ్రీకాకుళంలో రోడ్డుపై మురుగునీరు ప్రవాహం

VIDEO: శ్రీకాకుళంలో  రోడ్డుపై మురుగునీరు ప్రవాహం

శ్రీకాకుళం పట్టణంలోని చౌదరి సత్యనారాయణ కాలనీ సమీపంలో రోడ్డు పక్కనే మురుగునీరు ప్రవహిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు ఇళ్లలో ఉపయోగించే మురుగునీటిని సైతం రోడ్డుపైకి వదలడంతో రోడ్డు అధ్వానంగా మారిందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని కాలనీవాసులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.