జిల్లా కేంద్రంలో నేడు వ్యాక్సినేషన్ క్యాంప్

జిల్లా కేంద్రంలో నేడు వ్యాక్సినేషన్ క్యాంప్

NGKL: జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్‌లో శనివారం హజ్యాత్రికులకు టీకాలు వేస్తున్నట్లు ముస్లిం సంఘం నాయకులు తెలిపారు. జిల్లాలోని హజ్ యాత్రికులు హాజరై టీకాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు.