తుపానును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం: మంత్రి
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒడిశా మంత్రి సురేష్ పూజారి వెల్లడించారు. ఈ తుపాను తొలుత తమిళనాడు తర్వాత ఏపీపై ప్రభావం చూపి చివరిగా తమ రాష్ట్రంలోకి అడుగుపెడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసిందని తెలిపారు. ఈ మేరకు అన్ని రకాల విపత్తు నివారణ చర్యలు చేపట్టామన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.