పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాత వస్తువులకు వేలం

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాత వస్తువులకు వేలం

KMM: ఖమ్మం పోలీస్ శాఖలోని పాత వస్తువులకు ఈ నెల 13న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు నేడు సీపీ సునీల్ దత్ తెలిపారు. ఆసక్తి గల వారు ఆ రోజు ఉదయం 9 గంటలకు వేలంలో పాల్గొనవచ్చని సూచించారు. నగరంలోని ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) స్టోర్లో ఉన్న ఫర్నిచర్, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్ సామాగ్రి (CPU, UPS, ప్రింటర్లు) తదితరాలను వేలం వేయనున్నారు.