ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అంబేద్కర్ వర్ధంతి
NZB: నంది పేట్ మండలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల NSS-ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ 69వ వర్ధంతి (మహాపరి నిర్వాణ్ దివస్) నిర్వహించారు. అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్, NSS-PO లక్ష్మణ్ శాస్త్రి, AO తులసి రామ్, విభాగాధిపతులు కిషోర్, లావణ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.