అంగన్వాడి సెంటర్లను పరిశీలించిన DMHO
HNK: ప్రతి బుధవారం నిర్వహించే వ్యాధినిరోదక టీకాల కేంద్రాలలో గర్భిణి స్త్రీలు, పిల్లలకు టీకాలు ఇప్పించడంతో పాటు పోషకాహారం, ఇతర జాగ్రత్తలు వివరించాలని DMHO డా. ఏ.అప్పయ్య సూచించారు. బుధవారం ఆయన లష్కర్ సింగారం PHC పరిధిలోని పలు అంగన్వాడి సెంటర్లను పరిశీలించారు. ప్రతి సెంటర్‌లో వ్యాక్సినేషన్ కోసం ఉన్న డ్యూలిస్టును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.