చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ELR: నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లి ప్రవీణ్ (30) నూజివీడు నుండి గ్రామానికి బైక్‌పై వెళుతుండగా సోమవారం అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. సమీపంలోని వారు అందించిన సమాచారంతో ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన సేవలకు విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.