అనాథ మృతదేహానికి అంత్యక్రియలు
గుంటూరు బస్టాండ్ ఆవరణలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై జిల్లా కోవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు స్పందించారు. ఆ మృతదేహానికి వారు మానవత్వంతో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్థిక సాయం అందించగా, పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ట్రస్ట్ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.