మహిళల భద్రతలో సమాజం పాత్ర కీలకం: కలెక్టర్
అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాల్గొన్నారు. మహిళలపై జరిగే నేరాలను మొదటి దశలోనే అరికట్టాలని, సమాజం సహకారం అవసరమని కలెక్టర్ తెలిపారు. సోషల్ మీడియా వినియోగంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.