డ్రైన్ పనులను పర్యవేక్షించిన కమిషనర్

డ్రైన్ పనులను పర్యవేక్షించిన కమిషనర్
నెల్లూరులోని స్థానిక బృందావనం ప్రాంతంలో నూతనంగా నిర్మించిన డ్రైను కాలువ, సీసీ రోడ్డు, కల్వర్టుల నాణ్యతను నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారంగా పనులు జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అత్యంత నాణ్యతతో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.