గన్నవరం విమానాశ్రయం కొత్త అందాలు

గన్నవరం విమానాశ్రయం కొత్త అందాలు

కృష్ణా: గన్నవరం విమానాశ్రయం కొత్తదారి కనువిందు చేస్తోంది. ఎన్టీఆర్‌ వెటర్నరీ యూనివర్సిటీ ముందు కొత్తగా నిర్మించిన రోడ్డుకు ఇరువైపులా మధ్యలో పచ్చని మొక్కలు నాటి ఫుట్‌పాత్‌లు ఏర్పాటుచేశారు. డివైడర్‌ల మధ్యలో స్తంభాలకు సోలార్‌ ప్యానల్స్ బిగించారు. వీటికింద ఉండే దీపాలు రాత్రి వేళలో వెలుగుతూ కొత్త అందాలను పంచుతున్నాయి. మే 2న మోదీ పర్యటన నేపథ్యంలో మరింత శోభ రానుంది.