ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ నేతల ధర్నా

ATP: గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం ఎదురుగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూడాలని సూచించారు.