'వైసీపీ ఫేక్ ప్రచారాలను మానుకోవాలి'
ATP: రాష్ట్రంలో విపత్తులు ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వం పనిచేయడాన్ని జీర్ణించుకోలేక వైసీపీ డైవర్షన్ రాజకీయాలు, ఫేక్ ప్రచారాలకు పాల్పడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత సీజన్‌లో పంటలు కోల్పోయిన రైతులకు PM ఫసల్ బీమా యోజన కింద రైతులకు పరిహారం అందించామన్నారు.