నేడు బీఆర్ఎస్ ముఖ్యనేతల భేటీ
TG: తెలంగాణ భవన్‌లో ఇవాళ బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిపై చర్చించనున్నారు. ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొననున్నారు. కాగా జూబ్లీహిల్స్‌లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓడిన విషయం తెలిసిందే.