అల్వాల్ పీఎస్ పరిధిలో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
MDCL: అల్వాల్ PS పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బొల్లారం రిసాలా బజార్‌లోని శివాంస్ ప్రైడ్ అపార్ట్‌మెంట్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని తుమ్మల ప్రిన్సీ శ్రేష్ఠ ఆత్మహత్య చేసుకుంది. పెంపుడు పిల్లి విషయంలో తల్లితో జరిగిన తగాదా అనంతరం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.