అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లాలోని గుండ్లాపల్లిలో పారిశ్రామిక పరిశ్రమల పార్కుల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బిఎన్. విజయకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక వాడలో 30 షాపులను నిర్మించి, ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలకు వీటిని లీజుకు ఇస్తామని తెలిపారు. దీనికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామిక వెత్తలు పాల్గొన్నారు.