వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీ టైటిల్ ఇదేనా?

వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీ టైటిల్ ఇదేనా?

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు 'బావ బావమరిది' అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్.